Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:07 PM

‘మారెమ్మ’ చిత్రాన్ని ఆదరించండి

‘మారెమ్మ’ చిత్రాన్ని ఆదరించండి

‘మారెమ్మ’ చిత్రాన్ని ఆదరించండి
10-07-2026 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తెలంగాణ యాస, సంస్కృతితో రూపకల్పన: నిర్మాత బండారు మయూరి రెడ్డి

లక్కారంలో ఘనంగా సినిమా ప్రమోషన్స్

తెలంగాణ యాస, భాష, ఇక్కడి సంస్కృతి సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిన ‘మారెమ్మ’ చలనచిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదించాలని చిత్ర నిర్మాత బండారు మయూరి రెడ్డి కోరారు. మండల పరిధిలోని లక్కారం గ్రామంలో గల వీవీఎం గార్డెన్స్‌లో శుక్రవారం శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల కరస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో 'మారెమ్మ' సినిమా ప్రమోషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందం ముఖ్య అతిథులుగా హాజరై సందడి చేశారు.​ఈ సందర్భంగా నిర్మాత బండారు మయూరి రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచే గ్రామదేవత మారెమ్మ తల్లి మహిమలను, గ్రామీణ జీవన విధానాన్ని కళ్లకు కట్టేలా ఈ చిత్రాన్ని ఎంతో శ్రద్ధతో రూపొందించినట్లు తెలిపారు. ప్రతి కుటుంబం థియేటర్లలోనే ఈ సినిమాను వీక్షించాలని పిలుపునిచ్చారు.

​కథానాయకుడు మాధవ్ భూపతి రాజు మాట్లాడుతూ.. తన మొదటి సినిమా 'మారెమ్మ' కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే అంశాలు ఇందులో ఉన్నాయని, ప్రేక్షకుల ఆశీస్సులతో చిత్రం ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తంచేశారు.​ఈ కార్యక్రమంలో శ్రీ గాయత్రి విద్యాసంస్థల కరస్పాండెంట్ భీమిడి సుభాష్ రెడ్డి, కో-ప్రొడ్యూసర్ కుషాల్ రెడ్డి, డైరెక్టర్ మంచాల నాగరాజు, హీరోయిన్ దీప బాలు, చిత్ర నటీనటులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

‘మారెమ్మ’ చిత్రాన్ని ఆదరించండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News