Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:31 PM

ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గంగుల వెంకట్ రాజిరెడ్డి.

10-07-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గంగుల వెంకట్ రాజిరెడ్డి అన్నారు. రామన్నపేట మండలంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై శనివారం ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రతి అర్హుడైన ఓటరు హక్కును పరిరక్షించేందుకేనని అన్నారు. మండలంలోని ప్రతి కుటుంబం తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు లేకపోయినా, కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన వారు ఉన్నా ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ఓటర్ల నమోదులో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసి ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలని గంగుల వెంకట్ రాజిరెడ్డి కోరారు.

Sthanikam

ఓటర్ల జాబితాలో పేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గంగుల వెంకట్ రాజిరెడ్డి.

Article Image

రామన్నపేట,

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు గంగుల వెంకట్ రాజిరెడ్డి అన్నారు. రామన్నపేట మండలంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై శనివారం ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ చేపడుతున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమం ప్రతి అర్హుడైన ఓటరు హక్కును పరిరక్షించేందుకేనని అన్నారు. మండలంలోని ప్రతి కుటుంబం తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు లేకపోయినా, కొత్తగా ఓటరుగా నమోదు కావాల్సిన వారు ఉన్నా ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని, ఓటర్ల నమోదులో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. సంబంధిత అధికారులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసి ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలని గంగుల వెంకట్ రాజిరెడ్డి కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News