Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:11 PM

ఆదర్శ పాఠశాలలో డైనింగ్ హాల్, సీసీ రోడ్డు నిర్మించాలి ​– సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా

09-07-2026 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)ను గురువారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా, మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటానికి సరైన భవనం లేక రేకుల షెడ్డులోనే వండుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వర్షాకాలంలో వంటకు, విద్యార్థులు కూర్చొని తినడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇక్కడ వంటగదితో పాటు డైనింగ్ హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే మోడల్ స్కూల్‌కు వెళ్లే దారి గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే అక్కడ సీసీ రోడ్డు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, బండారు నరసింహ, దండా అరుణ్ కుమార్, ఆకుల ధర్మయ్య, తోర్పునూరి మల్లేశం, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఎం.డి. ఖయ్యూం, తోర్పునూరి వెంకటేష్, తోర్పునూరి సుమలత, గుణముని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆదర్శ పాఠశాలలో డైనింగ్ హాల్, సీసీ రోడ్డు నిర్మించాలి ​– సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా

Article Image

చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)ను గురువారం సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ పాషా, మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటానికి సరైన భవనం లేక రేకుల షెడ్డులోనే వండుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల వర్షాకాలంలో వంటకు, విద్యార్థులు కూర్చొని తినడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇక్కడ వంటగదితో పాటు డైనింగ్ హాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. అలాగే మోడల్ స్కూల్‌కు వెళ్లే దారి గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్షణమే అక్కడ సీసీ రోడ్డు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, బండారు నరసింహ, దండా అరుణ్ కుమార్, ఆకుల ధర్మయ్య, తోర్పునూరి మల్లేశం, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ఎం.డి. ఖయ్యూం, తోర్పునూరి వెంకటేష్, తోర్పునూరి సుమలత, గుణముని ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News