Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:09 PM

ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు
08-07-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన నాయకులు

* పేదల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు వైఎస్సార్‌: ఎండి ఖయ్యూం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, జనహృదయ నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను చౌటుప్పల్ పట్టణంలోని రాజీవ్ స్మారక భవనంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ స్మారక ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఎండి ఖయ్యూం మహానేత వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సంక్షేమ పథకాలు ఇప్పటికీ ప్రజల గుండెల్లో ఆయనను చిరస్థాయిగా నిలిపాయని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయ రామ్ చందర్, రాజీవ్ స్మారక ట్రస్ట్ అడ్వైజర్ నల్ల నరసింహ, చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ మాజీ మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, ఓబీసీ మున్సిపల్ అధ్యక్షులు ఆవుల యేసు యాదవ్, ఐఎన్ టీయూసీ బ్లాక్ అధ్యక్షులు కచ్చర్ల జగ్గయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాదాని గోపాల్, మాజీ షాదీఖానా చైర్మన్ ఎండి అజాజ్, ఐఎన్‌టీయూసీ మండల ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా, మున్సిపల్ అధ్యక్షులు ముత్యాల గణేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుర్కంటి భగవత్ రెడ్డి, నిమ్మల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా వైఎస్సార్‌ జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News