Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:11 PM

వెంకటాపూర్‌లో పిడుగు విషాదం.. యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

26-06-2026 611 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంలో పిడుగు పడడంతో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద పశువులను మేపుతున్న 25 ఏళ్ల చింతకుంట అనిల్ అక్కడికక్కడే మృతి చెందగా, అతనితో పాటు ఉన్న సిద్ధార్థ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సిద్ధార్థను వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్న వయసులోనే అనిల్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనిల్ మృతదేహాన్ని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించగా, ఘటనపై సదాశివపేట ఇన్‌స్పెక్టర్ వెంకటేశం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Sthanikam

వెంకటాపూర్‌లో పిడుగు విషాదం.. యువకుడు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Article Image

సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంలో పిడుగు పడడంతో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద పశువులను మేపుతున్న 25 ఏళ్ల చింతకుంట అనిల్ అక్కడికక్కడే మృతి చెందగా, అతనితో పాటు ఉన్న సిద్ధార్థ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సిద్ధార్థను వెంటనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్న వయసులోనే అనిల్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనిల్ మృతదేహాన్ని సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించగా, ఘటనపై సదాశివపేట ఇన్‌స్పెక్టర్ వెంకటేశం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News