Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:53 PM

మత్తుకు దూరం.. ప్రగతికి మార్గం!

మత్తుకు దూరం.. ప్రగతికి మార్గం!

మత్తుకు దూరం.. ప్రగతికి మార్గం!
26-06-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* యువత సన్మార్గాన నడిస్తేనే దేశ భవిష్యత్తు బలపడుతుంది

​* హోమియోపతి వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా. శివ ప్రసాద్

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే దేశ భవిష్యత్తు బలపడుతుందని తెలంగాణ హోమియోపతి వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డా. శివ ప్రసాద్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రతి ఒక్కరిలో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.​మాదకద్రవ్యాల వినియోగం కేవలం వ్యక్తుల ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా.. పచ్చని కుటుంబ వ్యవస్థను, సమాజాన్ని, దేశ ప్రగతిని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల నిర్మూలన కేవలం ఒక్కరితో సాధ్యం కాదు. ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు సమాజంలోని ప్రతి ఒక్కరూ సమిష్టిగా బాధ్యత తీసుకుని పనిచేయాలి. 'మత్తుకు కాదు... జీవితానికి అవును' అనే నినాదంతో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలి. ముఖ్యంగా విద్యార్థులు, యువత చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా.. విద్య, క్రీడలు, నైతిక విలువలు, సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించాలని డా. శివ ప్రసాద్ సూచించారు. యువత తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకునే మత్తు లోకం నుంచి బయటకు వచ్చి, సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Sthanikam

మత్తుకు దూరం.. ప్రగతికి మార్గం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News