Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 10:19 PM

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. నీట్ పరీక్షలకు పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ

20-06-2026 248 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆదివారం నిర్వహించనున్న నీట్-యూజీ 2026 పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సంగారెడ్డి జిల్లా పోలీసు శాఖ విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 9 పరీక్షా కేంద్రాల్లో 2,924 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానుండగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘా, జామర్ల ఏర్పాటు, ప్రత్యేక పోలీసు బందోబస్తుతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనుండగా, అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉండటంతో పాటు జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డు, గుర్తింపు కార్డుతో పాటు అవసరమైన పత్రాలు వెంట తీసుకురావాలని, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, నగలు తీసుకురావద్దని అధికారులు సూచించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా నిబంధనలు పాటిస్తూ సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షను విజయవంతంగా రాయాలని జిల్లా ఎస్పీ కోరారు.

Sthanikam

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత.. నీట్ పరీక్షలకు పోలీసుల ప్రత్యేక పర్యవేక్షణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News