Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:08 PM

కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

06-08-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ గంగాభవాని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, విశిష్ట సేవలు, ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన అందించిన ఆలోచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ మొగిలి, వినోద్, మాణిక్యం, శైలు, సంజు, ప్రవీణ్, శ్రీను, శంకర్ గోపాల్‌తో పాటు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

కంగ్టి తహసీల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ గంగాభవాని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, విశిష్ట సేవలు, ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన అందించిన ఆలోచనలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అబ్దుల్ మొగిలి, వినోద్, మాణిక్యం, శైలు, సంజు, ప్రవీణ్, శ్రీను, శంకర్ గోపాల్‌తో పాటు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News