Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

మహిళల భద్రతే పోలీసుల ధ్యేయం: సీఐ మన్మథకుమార్

06-08-2026 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మహిళల భద్రతే పోలీసుల ప్రధాన ధ్యేయమని, ఎలాంటి వేధింపులకు గురైనా భయాందోళన చెందకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మథకుమార్ సూచించారు. చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మోజీగూడెం గ్రామంలో గల జెన్‌టెక్ కంపెనీలో గురువారం మహిళల భద్రత, రక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మహిళలు విధులు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈవ్‌టీజింగ్, లైంగిక, సైబర్ వేధింపుల నిరోధానికి ఉన్న చట్టాల గురించి అవగాహన కల్పించారు. 'షి టీమ్స్', ఉమెన్ సేఫ్టీ, సీడబ్ల్యూడీ (క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్) విభాగాల ద్వారా అందుబాటులో ఉన్న రక్షణ సేవలను, అత్యవసర సమయాల్లో పోలీసుల నుంచి పొందే సాయాన్ని తెలియజేశారు. ​మహిళల భద్రతకు చౌటుప్పల్ పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని, పని ప్రదేశాల్లో లేదా వెలుపల ఏవైనా సమస్యలు ఎదురైతే నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు.

Sthanikam

మహిళల భద్రతే పోలీసుల ధ్యేయం: సీఐ మన్మథకుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News