Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:03 PM

మహిళల భద్రతపై రామన్నపేట పోలీసుల విస్తృత అవగాహన. సీఐ మొలుగురి రవి, ఎస్ ఐ గోపాతి సతీష్ ప్రజలకు కీలక సూచనలు

06-08-2026 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళలు, బాలికల భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు రామన్నపేట పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఐ మొలుగురి రవి పర్యవేక్షణలో, ఎస్ ఐ గోపాతి సతీష్ ఆధ్వర్యంలో మహిళల రక్షణ, బాలల భద్రత, అత్యవసర సేవల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ మొలుగురి రవి మాట్లాడుతూ మహిళలు, బాలికలపై జరిగే నేరాల నివారణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎలాంటి వేధింపులు, అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే డయల్–112, షీ టీమ్స్, మహిళా హెల్ప్‌లైన్–181, చైల్డ్ హెల్ప్‌లైన్–1098 సేవలను వినియోగించాలని సూచించారు.

ఎస్సై గోపాతి సతీష్ మాట్లాడుతూ చిన్నారులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్పై తల్లిదండ్రులు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఆయన అన్నారు.

మహిళల గౌరవం, బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, సమాజంలో భద్రతాయుత వాతావరణం ఏర్పడేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని రామన్నపేట పోలీసులు పిలుపునిచ్చారు.

Sthanikam

మహిళల భద్రతపై రామన్నపేట పోలీసుల విస్తృత అవగాహన. సీఐ మొలుగురి రవి, ఎస్ ఐ గోపాతి సతీష్ ప్రజలకు కీలక సూచనలు

Article Image

మహిళలు, బాలికల భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు రామన్నపేట పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఐ మొలుగురి రవి పర్యవేక్షణలో, ఎస్ ఐ గోపాతి సతీష్ ఆధ్వర్యంలో మహిళల రక్షణ, బాలల భద్రత, అత్యవసర సేవల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ మొలుగురి రవి మాట్లాడుతూ మహిళలు, బాలికలపై జరిగే నేరాల నివారణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఎలాంటి వేధింపులు, అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే డయల్–112, షీ టీమ్స్, మహిళా హెల్ప్‌లైన్–181, చైల్డ్ హెల్ప్‌లైన్–1098 సేవలను వినియోగించాలని సూచించారు.

ఎస్సై గోపాతి సతీష్ మాట్లాడుతూ చిన్నారులకు గుడ్ టచ్–బ్యాడ్ టచ్పై తల్లిదండ్రులు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మహిళల భద్రత కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఆయన అన్నారు.

మహిళల గౌరవం, బాలల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, సమాజంలో భద్రతాయుత వాతావరణం ఏర్పడేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని రామన్నపేట పోలీసులు పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News