Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:01 PM

అధికారుల నిర్లక్ష్యంతో బీమా కోల్పోయిన పంచాయతీ కార్మికుడి కుటుంబం

06-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బాధ్యులపై చర్యలు తీసుకుని కుటుంబాన్ని ఆదుకోవాలి: సీఐటీయూ జిల్లా నాయకుడు మద్దాల ప్రభాకరరావు

ఎర్రుపాలెం, ఆగస్టు 6: గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం కల్పించిన జీవిత బీమా పథకం అమలులో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడి కుటుంబం ఆర్థిక భరోసాను కోల్పోయిందని సీఐటీయూ జిల్లా నాయకుడు మద్దాల ప్రభాకరరావు ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, బాధిత కుటుంబానికి ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎర్రుపాలెం మండలంలోని బనిగండ్లపాడు గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న బలుసుపాటి ప్రసాద్ మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రభాకరరావు, సీఐటీయూ నాయకులు, పంచాయతీ కార్మికులతో కలిసి మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామపంచాయతీ కార్మికులకు పంచాయతీ నిధుల నుంచి జీవిత బీమా ప్రీమియం చెల్లించాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ, సంబంధిత అధికారులు వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. ప్రీమియం చెల్లించకపోవడం వల్ల మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి అందాల్సిన బీమా ప్రయోజనం అందకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కార్మికుల కుటుంబాలకు రక్షణ కల్పించాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బాధిత కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కో-కన్వీనర్ దూదిగం బసవయ్య, పంచాయతీ కార్మికులు గంతాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అధికారుల నిర్లక్ష్యంతో బీమా కోల్పోయిన పంచాయతీ కార్మికుడి కుటుంబం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News