Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:08 AM

అరుదైన బ్లాక్ బెంగాల్ జాతి సూడిమేక ఎముక కి శస్త్రచికిత్స

06-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నేరేడుచర్ల పట్టణానికి చెందిన నరేష్ అనే జంతు ప్రేమికుడు కోదాడ పట్టణ ప్రాంతీయ పశువైద్యశాల ఎదురుగానే నివాసం ఉంటూ అరుదైన బ్లాక్ బెంగాల్ జాతి మేకను పెంచుకుంటున్నారు. అది ఆడుతూ పాడుతూ ఇంట్లో నుండి బైటకు రాగానే అటుగా వెళ్తున్న బైక్ తగిలి గూడ ఎముక విరిగింది. అసలే అరుదైన ఔషధ గుణాలున్న పాలిచ్చే జాతి మేక, అందులోనూ రెండు మాసాల గర్భంతో ఉండడం తో దానిని ఎలాగైనా బ్రతికించుకోవాలనే తపనతో తెలిసిన వారిద్వారా ఎముకల శస్త్ర చికిత్స నిమిత్తం బుధవారం కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలకు మేకను తీసుకువచ్చారు.విరిగిన మేక కాలు ఎముకను పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య కడుపులో పిల్ల కి ప్రమాదం నివారించడానికి జనరల్ మత్తు బదులు స్థానిక మత్తు మాత్రమే ఇచ్చి శస్త్ర చికిత్స నిర్వహించారు. బైక్ గట్టిగా తగలడంతో విరిగిన ఎముకలు ఒకదానిపై ఒకటి చేరి లోనికి పొడుచుకుని పోవడంతో రెండు చివరలను జతచేయడానికి అతికష్టంతో మూడు గంటల పాటు శ్రమించి ప్లేట్ మరియు రాడ్ అమర్చి విజయవంతంగా ఎముకలను అతికించి శస్త్ర చికిత్స ముగించారు.శస్త్ర చికిత్సలో వెటరినరీ అసిస్టెంట్ సర్జన్ డా సిరిపురపు సురేంద్ర, సిబ్బంది శివ, చంద్రకళ, సాగర్ పాల్గొన్నారు.

Sthanikam

అరుదైన బ్లాక్ బెంగాల్ జాతి సూడిమేక ఎముక కి శస్త్రచికిత్స

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News