Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

పల్లె దవాఖానాకు డాక్టర్‌ను నియమించాలి

పల్లె దవాఖానాకు డాక్టర్‌ను నియమించాలి

పల్లె దవాఖానాకు డాక్టర్‌ను నియమించాలి
06-08-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పెండింగ్ బడి భవన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేయాలి: సీపీఎం

చౌటుప్పల్ మండలం జైకేసారం గ్రామంలోని పల్లె దవాఖానాలో వెంటనే ప్రభుత్వ వైద్యుడిని నియమించాలని, పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీపీఎం బృందం డిమాండ్ చేసింది. గురువారం జైకేసారంలోని ప్రభుత్వ పాఠశాల, పల్లె దవాఖానాలను సీపీఎం నాయకులు సందర్శించి సమస్యలపై సర్వే చేపట్టారు.​ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు రాగీరు కృష్ణయ్య మాట్లాడుతూ... పల్లె దవాఖానాలో శాశ్వత డాక్టర్ లేక, కనీస మందులు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే వైద్యుడిని నియమించి మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ​అలాగే, 'మన ఊరు – మన బడి' కింద మంజూరై పెండింగ్‌లో ఉన్న పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరారు. బడులు ప్రారంభమై మూడు నెలలవుతున్నా విద్యార్థులకు యూనిఫాంలు ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు పొట్ట శ్రీనివాస్, బోదాసు వెంకటేష్, ఉపసర్పంచ్ బోదాసు స్వాతి, వార్డు సభ్యురాలు నక్క జయసుధ, పార్టీ నాయకులు పొట్ట సాంబశివుడు, రాగీరు యాదయ్య, వనం శ్రీను, డీవైఎఫ్‌ఐ నాయకులు బోదాసు నరేష్, పల్లె శివకుమార్, రుద్రగోని మధు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పల్లె దవాఖానాకు డాక్టర్‌ను నియమించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News