Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:05 PM

తెలంగాణ కోసం జీవించిన మహనీయుడు. ఆచార్య జయశంకర్ సార్‌కు వెలిమినేడు గ్రామం ఘన నివాళి.

06-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త, తెలంగాణ రాష్ట్ర సాధనకు మేధోబలాన్ని అందించిన మహనీయుడు ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతిని వెలిమినేడు గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన మహోన్నత వ్యక్తిగా ఆయన సేవలను కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం అహర్నిశలు శ్రమించిన జయశంకర్ సార్ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని, ఆయన చూపిన మార్గంలో నడవడం ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని పలువురు నాయకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్య గౌడ్, వార్డు సభ్యులు మంకాల లింగస్వామి, ఆరూరి సునీత రవి, చింతకింది వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి తాటికొండ లింగస్వామి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సత్తిరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ బొంతల అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు చీమల వీరేశం, కిసాన్ మోర్చా జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు వెల్ది రాఘవరెడ్డి, సీపీఎం పార్టీ కార్యదర్శి పంది నరేష్, నాయకులు కర్దూరి అంజిరెడ్డి, చింతకాయల శివకృష్ణ, చిర్రగోని నరసింహ, వరికుప్పల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ కోసం జీవించిన మహనీయుడు. ఆచార్య జయశంకర్ సార్‌కు వెలిమినేడు గ్రామం ఘన నివాళి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News