Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:00 AM

ఏపీ జెన్–జెడ్ వార్ రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం

06-08-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్

రాష్ట్ర పార్టీ కార్యాచరణలో భాగంగా చీపురుపల్లి మూడు రోడ్ల జంక్షన్ వద్ద చేపట్టిన ఏపీ జెన్–జెడ్ వార్ రిలే నిరాహార దీక్షలకు యువ నాయకురాలు డా. బొత్స అనూష, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సంఘీభావం తెలిపారు. దీక్షల తొలి రోజున గుర్ల మండలానికి చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, విద్యార్థి, సామాజిక మాధ్యమాల విభాగాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం డా. బొత్స అనూష, బెల్లాన చంద్రశేఖర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి దీక్షలో పాల్గొంటున్న వారికి మద్దతు ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఉద్యమంలో ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు శోభా స్వాతి రాణి, కేవీ సూర్యనారాయణ (పులిరాజు), గుర్ల మండల నాయకుడు సన్యాసి నాయుడు, యువ నాయకులు బెల్లాన వంశీకృష్ణ, అప్పలనాయుడు, ఈశ్వరరావు, బంగారు నాయుడు, మణి, తిరుపతి, మధుసూదన్, విద్యార్థి నాయకులు కార్తీక్, కెల్ల సురేష్తో పాటు చీపురుపల్లి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, యువజన, విద్యార్థి, సామాజిక మాధ్యమాల విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ఏపీ జెన్–జెడ్ వార్ రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News