Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:59 PM

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జయంతి వేడుకలు.

06-08-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆచార్య జయశంకర్ సేవలు చిరస్మరణీయం.

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ ఆచార్య ఆర్. రత్నమంజుల అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ జీవితాంతం అహర్నిశలు కృషి చేశారని, తెలంగాణ సిద్ధాంతకర్తగా ఆయన అందించిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.అకడమిక్ కోఆర్డినేటర్, చరిత్ర విభాగాధిపతి డాక్టర్ డి. కిషన్ మాట్లాడుతూ కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్, వైస్‌ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను తన రచనలు, ఉపన్యాసాల ద్వారా ప్రజలకు వివరించారని చెప్పారు. విశాలాంధ్ర ఏర్పాటులోని లోపాలను ప్రజలకు తెలియజేస్తూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడితేనే నీళ్లు, నిధులు, ఉద్యోగాలపై తెలంగాణ ప్రజలకు హక్కులు దక్కుతాయని ఆయన బలంగా వాదించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం జీవితాంతం పోరాడి, రాష్ట్ర ఆవిర్భావాన్ని చూడకముందే ఆయన కన్నుమూయడం బాధాకరమని అన్నారు.

కార్యక్రమంలో ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. లక్ష్మీ నీలిమ, ఆర్థిక శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జయంతి వేడుకలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News