Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 02:44 AM

ఏఈఓలను పాత విధానంలోనే ఇన్-సర్వీస్ బీఎస్సీ (అగ్రి)కి పంపాలి జీవో–39 రద్దు చేయాలని డీఏఓకు వినతిపత్రం

06-08-2026 197 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇన్-సర్వీస్ బీఎస్సీ (అగ్రికల్చర్) ప్రవేశాల్లో పాత విధానాన్ని కొనసాగించి, 5 శాతం ఇన్-సర్వీస్ కోటాను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా వ్యవసాయ

విస్తరణాధికారుల (ఏఈఓ) సంఘం ప్రతినిధులు గురువారం జిల్లా వ్యవసాయ అధికారి (డీఏఓ)కి వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర సెంట్రల్ ఫోరం పిలుపు మేరకు ఈ వినతిపత్రాన్ని సమర్పించినట్లు సంఘ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జీవో ఎంఎస్ నెం.250 (06-10-2009) స్ఫూర్తికి అనుగుణంగా డిప్లొమా అర్హత కలిగిన ఏఈఓలకు ఇన్-సర్వీస్ బీఎస్సీ (అగ్రి)లో సీనియారిటీ ప్రాతిపదికన ప్రవేశాలు కల్పించాలని కోరారు.

ప్రస్తుతం అమలవుతున్న విధానం కారణంగా సీనియర్ ఏఈఓలు అవకాశాలు కోల్పోతున్నారని, దీంతో జీవో–250 ఉద్దేశం దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత విద్యా సంవత్సరంలో 31 మంది ఏఈఓలకు అవకాశం కల్పించగా, ఈ ఏడాది కేవలం 19 సీట్లు మాత్రమే కేటాయించడం వల్ల అర్హులైన పలువురు నష్టపోతున్నారని పేర్కొన్నారు.

అందువల్ల పాత విధానాన్ని పునరుద్ధరించి, సీనియారిటీ ఆధారంగా ఎంపికలు చేపట్టడంతో పాటు 5 శాతం ఇన్-సర్వీస్ కోటాను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే ఏఈఓల సేవా ప్రయోజనాలు, విద్యా అవకాశాలు, ఉద్యోగోన్నతి అవకాశాలకు ప్రతికూలంగా ఉన్న జీవో ఎంఎస్ నెం.39ను వెంటనే రద్దు చేయాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవో అనుబంధ సంఘం టీఏఈఓఏ జిల్లా అధ్యక్షుడు పెద్దపంగ ప్రణయ్, జిల్లా కార్యదర్శి డి. మనోజ్ కుమార్, జిల్లా ట్రెజరర్ షేక్ ముస్తఫా, రాష్ట్ర సెంట్రల్ ఫోరం ఆర్గనైజింగ్ సెక్రటరీ కోడి మురళి, ఏఈఓలు శ్రీను, శైలజ, వెంకటేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఏఈఓలను పాత విధానంలోనే ఇన్-సర్వీస్ బీఎస్సీ (అగ్రి)కి పంపాలి జీవో–39 రద్దు చేయాలని డీఏఓకు వినతిపత్రం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News