Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:00 PM

తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి ప్రొ. జయశంకర్: మల్లేపల్లి లక్ష్మయ్య

06-08-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఘనంగా 92వ జయంతివేడుకలు

తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని బుద్ధవనం ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి, దళిత అధ్యయన కేంద్రం వ్యవస్థాపక ఛైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ప్రొ. జయశంకర్ 92వ జయంతి సందర్భంగా Dr. B.R. Ambedkar Open Universityలో నిర్వహించిన స్మారకోపన్యాస కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని "ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలు – సామాజిక ఉద్యమాలు" అంశంపై ప్రసంగించారు.

ఉద్యమాన్ని నిర్మించడం, ప్రజల్లో భావజాలాన్ని విస్తరించడం, ఆ తరువాత రాజకీయ ప్రక్రియ ద్వారా లక్ష్యాన్ని సాధించడం అనే స్పష్టమైన సిద్ధాంతాన్ని ప్రొ. జయశంకర్ ప్రతిపాదించారని మల్లేపల్లి లక్ష్మయ్య పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన ఆలోచనలు కీలక పాత్ర పోషించాయని, అందుకే తెలంగాణ ప్రజలు ఆయనను సిద్ధాంతకర్తగా గౌరవిస్తారని చెప్పారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి ఆయన జీవితాంతం కృషి చేశారని, నేటి యువత ఆయన ఆదర్శాలను అనుసరించాలని సూచించారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైస్‌ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రొ. జయశంకర్ జీవితాశయమని అన్నారు. తెలంగాణ ఉద్యమంలోని అన్ని దశల్లో ఆయన చురుకైన పాత్ర పోషించారని, అదే అనుభవం తుది దశ ఉద్యమానికి బలాన్నిచ్చిందన్నారు. అధ్యాపకుడిగా, రిజిస్ట్రార్‌గా, వైస్‌ ఛాన్సలర్‌గా బాధ్యతలు నిర్వహించినప్పటికీ ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తారని కొనియాడారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్–3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు.

విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి కార్యక్రమం ఆవశ్యకతను వివరించి ముఖ్య అతిథిని సభకు పరిచయం చేశారు. అంతకుముందు డా. బి.ఆర్. అంబేద్కర్, ప్రొ. కె. జయశంకర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్, ప్రొ. ఆనంద్ పవార్, ప్రొ. పల్లవి కాబ్డే, డా. వై. వెంకటేశ్వర్లు, ప్రొ. ఎన్. రజని, ప్రొ. ప్రమీలా కేతావత్, ప్రొ. చంద్రకళ, ప్రొ. మేరీసునందతో పాటు అన్ని విభాగాల డైరెక్టర్లు, డీన్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఉద్యోగ సంఘాల నాయకులు కాంతం ప్రేమ్ కుమార్, డా. యాకేష్ దైదా, మియా జాని, మంజుల, కె. పాండు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి ప్రొ. జయశంకర్: మల్లేపల్లి లక్ష్మయ్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News