Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

లక్కారం వద్ద గోవుల అక్రమ రవాణాకు బ్రేక్

లక్కారం వద్ద గోవుల అక్రమ రవాణాకు బ్రేక్

లక్కారం వద్ద గోవుల అక్రమ రవాణాకు బ్రేక్
06-08-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​29 పశువులతో వెళ్తున్న వాహనం సీజ్.. పోలీసులకు అప్పగించిన భజరంగ్‌దళ్‌

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌లోని బహదూర్‌పూర్‌కు పశువులను అక్రమంగా తరలిస్తున్న యత్నాన్ని భజరంగ్‌దళ్ కార్యకర్తలు భగ్నం చేశారు. చౌటుప్పల్ మండలం లక్కారం సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక వాహనాన్ని వారు అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు.

​పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తనిఖీ చేయగా.. అందులో అత్యంత దయనీయ స్థితిలో ఉన్న 21 ఎద్దులు (నందిమహారాజులు), 8 గోవులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పశువులను స్వాధీనం చేసుకుని, సురక్షిత ప్రాంతంలో ఉన్న గోశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.గోవులను అక్రమంగా కసాయిఖానాలకు తరలిస్తున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని భజరంగ్‌దళ్ జిల్లా కో–కన్వీనర్ గోగు రవి డిమాండ్ చేశారు. పశువుల రవాణాపై అధికారులు నిరంతరం దృష్టి సారించాలని, సరిహద్దుల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అక్రమ రవాణాకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని కోరారు.

Sthanikam

లక్కారం వద్ద గోవుల అక్రమ రవాణాకు బ్రేక్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News