Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:48 PM

చుండూరు అమరవీరులకు ఘన నివాళులు

చుండూరు అమరవీరులకు ఘన నివాళులు

చుండూరు అమరవీరులకు ఘన నివాళులు
06-08-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

35 ఏళ్లైనా బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరగలేదని ఆవేదన

చుండూరులో కులవివక్ష నేపథ్యంలో దళితులపై జరిగిన దారుణ ఘటనను మరువలేమని, బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పేర్కొన్నారు.

చుండూరు ఘటనకు 35 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా గురువారం గోదావరిఖనిలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్‌లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో చుండూరు అమరవీరులకు ఘన నివాళులర్పించారు. పెద్దపెల్లి జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బొంకూరి మధు, కొంకటి లక్ష్మణ్, మైస రాజేష్, కాంపెల్లి సతీష్, ఈదునూరి పద్మ మాట్లాడుతూ చుండూరు ఘటనలో కులదురహంకారంతో ఎనిమిది మంది దళితులను అత్యంత దారుణంగా హత్య చేశారని గుర్తు చేశారు. ఘటన జరిగి 35 సంవత్సరాలు గడిచినా బాధిత కుటుంబాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చుండూరు అమరవీరులకు న్యాయం జరిగేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బొచ్చు శంకర్, జనగామ రాజనర్సు, గద్దల శశిభూషణ్, బూడిద సమ్మయ్య, మేకల సురేష్, పుల్లూరి మహేందర్, పంజా అశోక్, కాంపెల్లి జీవన్ కుమార్, రామగిరి రమేష్, జిలకర రామస్వామి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఈదునూరి పద్మ, జనగామ రాజనర్సు ఆలపించిన చుండూరు ఘటనకు సంబంధించిన పాటలు పలువురిని భావోద్వేగానికి గురిచేశాయి. కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం, మున్సిపల్ కార్పొరేషన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

చుండూరు అమరవీరులకు ఘన నివాళులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News