Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి – తపస్ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి.. ఆరు డీఏలను ఒకేసారి విడుదల చేయాలి.

Updated : 06 Aug 2026 18:53 IST
As Preferred Source 1 min read
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి – తపస్ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి.. ఆరు డీఏలను ఒకేసారి విడుదల చేయాలి.

మంచాల, ఆగస్టు 6: తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ సంఘం (తపస్) ఆధ్వర్యంలో మంచాల మండలంలో నిర్వహించిన సభ్యత్వ అభియాన్ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర మీడియా కో-కన్వీనర్ సత్తారి రాజిరెడ్డి, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పూజారి రమేశ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం తపస్ ఆధ్వర్యంలో ఆగస్టు 1న నిర్వహించిన రాష్ట్ర మహా ధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లారని తెలిపారు.

ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలని, ఆరు డీఏలను ఒకేసారి విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని, 2008 డీఎస్సీ ఉపాధ్యాయుల సమస్యలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో తపస్ మంచాల మండల అధ్యక్షుడు రావుల శివకుమార్, ప్రధాన కార్యదర్శి కావలి దత్తాత్రేయ, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా బాధ్యులు రావుల వెంకటేష్, మండల నాయకులు యాదగిరి, రవీందర్‌రావు, సుమలత, విజయజ్యోతి, జంగయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news