Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:10 PM

కేజీబీవీలో రుతుక్రమ పరిశుభ్రతపై చైతన్యం.. 3 వేల శానిటరీ ప్యాడ్ల పంపిణీ: జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి

06-08-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో కొండాపూర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో విద్యార్థినులకు రుతుక్రమ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శానిటరీ ప్యాడ్ బ్యాంకు ద్వారా 3,000 శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి శ్రీమతి కె. లలిత కుమారి మాట్లాడుతూ రుతుక్రమం ప్రతి బాలిక జీవితంలో సహజమైన ప్రక్రియ అని, దీనిపై అపోహలు లేదా భయాలు అవసరం లేదన్నారు. రుతుక్రమ సమయంలో నాణ్యమైన శానిటరీ ప్యాడ్లను ఉపయోగిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే ఇన్ఫెక్షన్లను నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వం బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం ద్వారా బాలికల విద్య, ఆరోగ్యం, భద్రత, సాధికారతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ లలితా దేవి మాట్లాడుతూ యుక్తవయస్సులో ఉన్న బాలికలు రక్తహీనతకు గురికాకుండా ఐరన్, ఫోలిక్ యాసిడ్, ప్రోటీన్లు, కాల్షియం అధికంగా ఉండే పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఆకుకూరలు, పప్పుధాన్యాలు, పాలు, గుడ్లు, పండ్లు, చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు పరిశుభ్రత, తగిన విశ్రాంతి, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే ఆరోగ్యంగా ఉండటంతో పాటు చదువులో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చని వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా సమన్వయకర్త పల్లవి, సీడీపీఓ శ్రీమతి చంద్రకళ, ఎస్‌ఓ కవిత, ఎంపీడీఓ, ఎంఈఓ, సర్పంచ్, పోలీసు శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శి, వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, షీ టీమ్ సభ్యులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కేజీబీవీలో రుతుక్రమ పరిశుభ్రతపై చైతన్యం.. 3 వేల శానిటరీ ప్యాడ్ల పంపిణీ: జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News