Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వినాయకుని దగ్గర పూజలు చేసిన; ఎస్ఐ నరేష్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 09:09 PM

ప్రజాకవి గద్దర్ సేవలు చిరస్మరణీయం.. నారాయణఖేడ్‌లో ఘనంగా వర్థంతి

06-08-2026 165 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని అంబేద్కర్ భవన్‌లో గురువారం ప్రజాకవి గద్దర్ మూడో వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, అంబేద్కర్ భవన్ ఇన్‌చార్జి భీమసేన, బీఎస్పీ నాయకులు అనుముల తుకారం, నారాయణరెడ్డి అధ్యక్షుడు, సిద్దు, సామిల్, యేసు తదితరులు గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ గద్దర్ తన పాటలు, రచనలు, ఉద్యమాల ద్వారా అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన గొప్ప ప్రజాకవి, ప్రజాకళాకారుడని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. గద్దర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక చైతన్యం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు గద్దర్ సేవలను స్మరించుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

Sthanikam

ప్రజాకవి గద్దర్ సేవలు చిరస్మరణీయం.. నారాయణఖేడ్‌లో ఘనంగా వర్థంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News