Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా నూతి వెంకటేశo

06-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో నూతి వెంకటేశం వర్గం ఘనవిజయం సాధించింది. నిన్న నిర్వహించిన పాలకవర్గ ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాలకు గాను తొమ్మిది డైరెక్టర్ పీఠాలను కైవసం చేసుకుని రికార్డు విజయాన్ని నమోదు చేసింది. ​ఈ విజయం అనంతరం గురువారం నిర్వహించిన నూతన కార్యవర్గ ఎంపిక ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడుగా నూతి వెంకటేశం ​ఉపాధ్యక్షుడు గా బైరగోని పెద్దస్వామి, ​కార్యదర్శి గుండెబోయిన రాజు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ఉపాధ్యక్షులు మరియు కార్యదర్శి మాట్లాడుతూ తమపై నమ్మకంతో తొమ్మిదికి తొమ్మిది స్థానాల్లో గెలిపించిన మత్స్యకార సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని మత్స్యకారుల సంక్షేమానికి, సంఘం బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ​కార్యవర్గ ఎంపిక అనంతరం గ్రామస్తులు, సంఘ సభ్యులు నూతన కార్యవర్గానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు మరియు మత్స్యకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

మత్స్యపారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా నూతి వెంకటేశo

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News