Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:53 PM

రేపటితో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి

రేపటితో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి

రేపటితో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి
26-06-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక దృష్టితో విజయవంతం

* మద్దతు ధరతో కొనుగోలు.. రైతులకు తప్పిన ఇబ్బందులు

​* ఏఎంసీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి వెల్లడి

చౌటుప్పల్ మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు రేపటితో పూర్తిగా ముగియనున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) వైస్ ఛైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మండలంలోని అంకిరెడ్డిగూడెం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు. దాదాపు అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయి లోడింగ్ ప్రక్రియ నడుస్తోందని, మిగిలిపోయిన అంకిరెడ్డిగూడెం కేంద్రం రేపటితో సంపూర్ణంగా ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు.​ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించడంతోనే ఈ ప్రక్రియ విజయవంతమైందన్నారు. ఈ సారి ఎన్నడూ లేని విధంగా భారీగా ధాన్యం వచ్చినప్పటికీ, రైతులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. ధాన్యం నిల్వలకు ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అధికారులను, నాయకులను అప్రమత్తం చేశారు. ఆయన చొరవతో ఏఎంసీతో పాటు అంకిరెడ్డిగూడెం, మల్కాపురం, ధర్మోజీగూడెంలో అదనంగా గోదాములను (గిడ్డంగులు) సేకరించి రైతులకు ఊరట కల్పించాం.ధాన్య సేకరణను విజయవంతం చేయడానికి క్షేత్రస్థాయిలో రాత్రింబవళ్లు శ్రమించిన మునుగోడు కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, సహకరించిన రైతులకు ఇంద్రసేనారెడ్డి ఈ సందర్భంగా పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

రేపటితో వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News