Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన రాంనగర్ యూత్, వెల్ఫేర్ అసోసియేషన్ వైభవంగా గణనాథుడి పూజలు 80s AI ఫొటోల క్రేజ్.. షాకింగ్ నిజాలు! న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 15, 2026 10:14 AM

రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్

05-06-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని రైతులందరికీ తెలియజేయునది ఏమనగా, రానున్న ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన విత్తన వేరుశెనగ పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేపటి నుండి సంబంధిత రైతు సేవా కేంద్రాలు (RSKs)లో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చును.

వేరుశెనగ విత్తనాలు పొందదలచిన రైతులు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవలసిందిగా కోరడమైనది. జిల్లాలో విత్తన వేరుశెనగ పంపిణీ త్వరలో ప్రారంభం కానుండగా, రైతులు ముందస్తుగా నమోదు చేసుకోవడం ద్వారా పంపిణీ కార్యక్రమం సజావుగా నిర్వహించుటకు సహకరించగలరని అధికారులు తెలిపారు.

ప్రభుత్వం 40% రాయితీతో విత్తన వేరుశెనగ పంపిణీ చేయనుండగా, రైతు వాటా క్రింది విధంగా నిర్ణయించబడింది:

• K-6 మరియు TCGS-1694 రకాలకు 30 కేజీల బస్తా ధర రూ. 1836

• KL-1812 రకానికి 30 కేజీల బస్తా ధర రూ. 1710

విత్తన వేరుశెనగ కావలసిన రైతులు పట్టా పాసు పుస్తకం, ఆధార్ కార్డు మరియు మొబైల్ ఫోన్‌తో సంబంధిత రైతు సేవా కేంద్రాలను సంప్రదించవలెనని సూచించారు.

మండలంలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వెంటనే నమోదు చేసుకోవలసిందిగా మండల వ్యవసాయ అధికారి శ్రీ AP సంజీవ్ కుమార్ గారు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News