Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:33 AM

వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు

14-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి:

స్థానిక మార్కెట్ రోడ్డులోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మిస్ట్రెస్ వనజావాణి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి మొదటి గురువు తల్లి అయితే, రెండవ గురువు ఉపాధ్యాయులని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.

ఈ సందర్భంగా వక్త జెక్క చంద్రా మాట్లాడుతూ, ఈ పాఠశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు.

గ్రామ పెద్దలు, ఇతర వక్తలు మాట్లాడుతూ, ఈ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణకు ప్రతీకలని, గురువులు నేర్పిన విలువలను జీవితంలో పాటించి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, గురువుల శ్రమకు తగిన ఫలితాలు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

అనంతరం గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రవీంద్ర, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వివేకానంద పాఠశాల 10వ వార్షికోత్సవం ఘనంగా అలరించిన చిన్నారుల నృత్యాలు – గురువులే విద్యార్థుల భవితకు మార్గదర్శకులు

Article Image

సోమందేపల్లి:

స్థానిక మార్కెట్ రోడ్డులోని వివేకానంద ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో మంగళవారం 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మిస్ట్రెస్ వనజావాణి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి మొదటి గురువు తల్లి అయితే, రెండవ గురువు ఉపాధ్యాయులని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు.

ఈ సందర్భంగా వక్త జెక్క చంద్రా మాట్లాడుతూ, ఈ పాఠశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు.

గ్రామ పెద్దలు, ఇతర వక్తలు మాట్లాడుతూ, ఈ పాఠశాల విద్యార్థులు క్రమశిక్షణకు ప్రతీకలని, గురువులు నేర్పిన విలువలను జీవితంలో పాటించి ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి, గురువుల శ్రమకు తగిన ఫలితాలు సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు.

అనంతరం గ్రామ పెద్దలు, పాఠశాల ఉపాధ్యాయులు మరియు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రవీంద్ర, తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News