Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:32 AM

కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం

06-05-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దడం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి సవిత తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భోజనం, ఆధునిక సదుపాయాలు అందిస్తూ వారి భవిష్యత్తును బలపరుస్తున్నామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పెనుకొండ నియోజకవర్గానికి చెందిన 10వ తరగతి పరీక్షల్లో 540కు పైగా మార్కులు సాధించిన 121 మందికి పైగా విద్యార్థులను ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఎస్‌ఆర్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు కూడా ప్రదానం చేశారు. టీ. శిరీషా, అంజూమ్‌లకు రూ.30,000 చొప్పున, హర్షితకు రూ.25,000, నిహాన్ మరియు వంశీలకు రూ.20,000 చొప్పున బహుమతులు అందించారు.

మంత్రి సవిత మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో పలు మార్పులు తీసుకొచ్చామని, “తల్లికి వందనం” వంటి పథకాల ద్వారా కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. మాక్ అసెంబ్లీలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సామాజిక, రాజకీయ అవగాహన పెంచుతున్నామని చెప్పారు. నారా లోకేష్ చేపట్టిన చర్యల వల్ల విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కష్టపడి ఉన్నత ఫలితాలు సాధించడం ఆనందదాయకమని మంత్రి తెలిపారు. విద్య ద్వారానే మంచి భవిష్యత్తు సాధ్యమవుతుందని, విద్యార్థులు లక్ష్యసాధన కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పిల్లలను ప్రోత్సహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Sthanikam

కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News