Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
300 మీటర్ల జాతీయ జెండాతో తైక్వాండో క్రీడాకారుల తిరంగా ర్యాలీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 06:47 AM

300 మీటర్ల జాతీయ జెండాతో తైక్వాండో క్రీడాకారుల తిరంగా ర్యాలీ

16-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ పట్టణంలో విన్నర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీ, తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. 300 మీటర్ల పొడవైన జాతీయ జెండాతో నిర్వహించిన ఈ ర్యాలీ విన్నర్స్ వరల్డ్ తైక్వాండో అకాడమీ నుంచి ప్రారంభమై క్లాక్ టవర్ సెంటర్ వద్ద ముగిసింది.

వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, కోచ్‌లు, తైక్వాండో క్రీడాకారులు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ మార్గమంతా దేశభక్తి నినాదాలతో సందడి నెలకొంది.

తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ నల్గొండ సెక్రటరీ ఎండీ యూనుస్ కమాల్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. క్రీడల ద్వారా యువతలో ఐక్యత, క్రమశిక్షణ, దేశభక్తి, జాతీయ సమైక్యత భావాలను పెంపొందించడమే ర్యాలీ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

అనంతరం పాల్గొన్న వారంతా రాజ్యాంగ విలువలను కాపాడుతూ దేశ సేవకు అంకితమవుతామని ప్రతిజ్ఞ చేశారు.

Sthanikam

300 మీటర్ల జాతీయ జెండాతో తైక్వాండో క్రీడాకారుల తిరంగా ర్యాలీ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News