Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:36 PM

ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యార్థులకు నగదు బహుమతులు

15-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ప్రధానోపాధ్యాయురాలు బి. సుశీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు.కెనరా బ్యాంక్ మేనేజర్ ఎ. బిశ్వాస్ విద్యార్థినులు రుచిత, భవాని, తేజ, సహస్ర, హారిక, కామాక్షిలకు ఉపకార వేతనాలను అందజేశారు. గత సంవత్సరం ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో ఆయా సబ్జెక్టుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు సంకీర్తన, షాహిన్, పూజ, శివప్రసాద్, మల్లన్న, యాస్మిన్, శిరీష, భవాని, ధన్యకౌర్‌లను ఉపాధ్యాయులు అభినందించి నగదు బహుమతులు అందించారు.గణిత ఉపాధ్యాయులు ఇందిర, శైలజ, ఆంగ్ల ఉపాధ్యాయులు కవిత, మంజుల, హిందీ ఉపాధ్యాయులు ఎండీ. సాదిక్, బయాలజీ ఉపాధ్యాయురాలు సరళ తమ వంతుగా నగదు బహుమతులు అందించి విద్యార్థులను ప్రోత్సహించారు.అలాగే సీనియర్ ఉపాధ్యాయులు కోణం శ్రీనివాస్ తమ కోణం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ తరగతి విద్యార్థులకు టీషర్టులు అందజేస్తామని ప్రకటించారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.

కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు చిలకరాజు శ్రీనివాస్, ఎ. పద్మజ, ఎన్. సైదులు, సీహెచ్. ప్రసన్న, ఎం. జానకి, ఎం. సౌమ్య, ప్రవీణ, కుసుమ, శ్రీనివాస్, తిరుమల, నవీన్, హైమవతి తదితరులు పాల్గొన్నారు. బహుమతులు, ఉపకార వేతనాలు అందుకున్న విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

Sthanikam

ప్రతిభకు ప్రోత్సాహం.. విద్యార్థులకు నగదు బహుమతులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News