Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:58 PM

కాసోజు శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం

కాసోజు శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం

కాసోజు శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం
15-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 40వ జయంతి సందర్భంగా తెలంగాణ పొలిటికల్‌ యువజన సమితి (TPYS) యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు తంగళ్లపల్లి గిరిధరాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా గిరిధరాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మార్పణ చేసిన మహోన్నత త్యాగమూర్తి శ్రీకాంతాచారి అని కొనియాడారు. ఆయన త్యాగం మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచి కోట్లాది మంది ఉద్యమకారుల్లో చైతన్యం నింపిందన్నారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో TPYS జిల్లా ఉపాధ్యక్షుడు తొర్రి సురేష్, ప్రధాన కార్యదర్శి కొంగరి మహేష్, కోఆర్డినేటర్‌ మహాకాళి సురేష్‌చారి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సురుపంగ కుమార్, కార్యదర్శులు నమోజు రాజుచారి, పడిగం శ్రీనివాస్, కోశాధికారి కుంచం రాజు, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు వెలిశాల బ్రహ్మచారి, చెన్నోజు నరహరిచారి, కానుగంటి ప్రేమ్‌కుమార్, చోల్లేటి శ్రీనివాసచారి, అక్కెనపల్లి శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాసోజు శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News