Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:07 PM

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో నూతన నియామకాలు

08-08-2026 275 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు శెట్టి అశోక్, జాతీయ ప్రధాన కార్యదర్శి శెట్టి వెంకటేష్ ఆదేశాల మేరకు శనివారం సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జిల్లా అధ్యక్షులు బస్వరాజ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాతీయ సంయుక్త కార్యదర్శి తమ్మాలి సంగమేశ్వర్, జాతీయ ప్రచార కార్యదర్శి కర్చల సంగమేశ్వర్, రాష్ట్ర కార్యదర్శి నాగేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మన్నే పోచయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆందోల్ ప్రాంతానికి చెందిన జె. రాజును సంగారెడ్డి జిల్లా ముఖ్య సలహాదారుగా, డి. సుకుమార్, బి. బాలరాజ్‌లను సంగారెడ్డి జిల్లా సభ్యులుగా, ఎస్. యాదయ్యను ఆందోల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా నియమించారు. నూతనంగా నియమితులైన పదాధికారులకు జోగిపేట ఏఎస్ఐ దుర్గయ్య చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేసి అభినందించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. నూతన పదాధికారులు తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జాతీయ, రాష్ట్ర, జిల్లా కమిటీలకు కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పనిచేస్తూ, సంఘం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో నూతన నియామకాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News