Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:37 PM

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

08-08-2026 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రైతులకు విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సహించేది లేదని స్పష్టం చేశారు.

రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదు.విద్యుత్ అధికారుల తీరుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశం.

నల్లగొండ: విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసే విధంగా అధికారులు వ్యవహరిస్తే ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు.

లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న అధికారులు బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా లైన్మెన్లు వెల్పర్లకు తక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి వారి స్థానంలో ఇతరులను విధుల్లో పెట్టుకుంటున్నారన్న ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వ్యవహారాలను కఠినంగా అరికట్టాలని అధికారులను ఆదేశించారు.

ఏఈలు, డీఈలు క్షేత్రస్థాయికి వెళ్లాలి:

విద్యుత్ శాఖలోని ఏఈలు, డీఈలు కార్యాలయాలకే పరిమితం కాకుండా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రైతుల విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.విద్యుత్ పరికరాల కొరత లేకుండా చూడాలి:ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు, కేబుళ్లు, ఇతర విద్యుత్ పరికరాల కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచి విద్యుత్ సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించేలా వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

Sthanikam

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విద్యుత్ శాఖ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News