Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:12 PM

బైక్‌ దొంగ అరెస్ట్‌.. రెండు వాహనాలు స్వాధీనం.

08-08-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండలో పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితుడు.

నల్గొండ: ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద హోండా షైన్‌ మోటార్‌సైకిల్‌ చోరీ కేసులో నిందితుడిని నల్గొండ రెండో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పానగల్‌ బైపాస్‌ రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన మహమ్మద్‌ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్‌ చోరీ విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన స్కూటీ, మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండలో చోరీ చేసిన హోండా షైన్‌తో పాటు నెల్లూరులో చోరీ చేసిన స్కూటీని కూడా అతడి వద్ద నుంచి రికవరీ చేసినట్లు వెల్లడించారు.

ఇస్మాయిల్‌పై గతంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో బైక్‌ చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ కేసుల్లో అరెస్టై చర్లపల్లి జైలులో ఏడాది శిక్ష అనుభవించినప్పటికీ, జైలు నుంచి విడుదలైన అనంతరం మళ్లీ బైక్‌ చోరీలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

పోలీసుల అప్రమత్తతతో రెండు వాహనాలను స్వల్ప వ్యవధిలోనే రికవరీ చేయడం విశేషం. డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో, సీఐ కె. ఆది రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఐలు డి. సైదాబాబు, జి. మానసతో పాటు పోలీసు సిబ్బంది బాలకోటి, షకీల్‌, సైదులు, మహేష్‌ కీలకంగావ్యవహరించారు.

నిందితుడిని పట్టుకుని వాహనాలను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Sthanikam

బైక్‌ దొంగ అరెస్ట్‌.. రెండు వాహనాలు స్వాధీనం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News