Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:29 AM

ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగే "జైల్ భరో''ను జయప్రదం చేయండి.సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి

08-08-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

నాగారం:నాటి స్వాతంత్ర్య పోరాటానికి ఊపిరిలూదిన క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశాన్ని కాపాడుకునేందుకు 2026 ఆగస్టు 10వ తేదీన జరిగే జైల్ భరో'ను జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి అన్నారు.

శనివారం నాగారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక, రైతు,ప్రజా వ్యతిరేక విధానాలను వేగంగా అమలు చేస్తుందని ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న దేశ స్వాతంత్రాన్ని విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతూ నయా ఉదారవాద సంస్కరణలు అమలు చేస్తుందన్నారు. నాటి స్వాతంత్ర కాలంలో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఉల్లంఘించి నూతన లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందని దీని ద్వారా కార్మిక హక్కులను హరించి వేస్తుందన్నారు, 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచేందుకు యాజమాన్యాలు కార్మికులను దోపిడీ చేసేందుకు పూర్తి స్వేచ్ఛనిస్తుందని.మరోవైపు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ నూతన విబిజి గ్రామ్ జీ పథకం గా పేరును మార్చి రాష్ట్ర ప్రభుత్వాలపై పెద్ద ఎత్తున భారం వేస్తూ తన బాధ్యతను తప్పుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్టలు చేస్తుందన్నారు అమెరికా, బ్రిటన్ న్యూజిలాండ్ తో కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్యవ్యాపారాలు చేసుకొని భారత వ్యవసాయ రంగంలో 32 దేశాల నుండి దిగుమతులను ప్రోత్సహిస్తుందని వీటికి జీరో సుంకంతో దిగుమతులు రావడంతో దేశీయ వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తగ్గిపోయి రైతులు దివాలా తీసి అవకాశాలున్నాయన్నారు. భారతదేశంలో ఏటా పద్దెనిమిది లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ కు వస్తుండగా కనీసం మద్దతు ధరలు అమలు జరుపుకోవడం వల్ల రైతులు ఏటా నాలుగు లక్షల కోట్లు నష్టపోతున్నట్లు ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ గులాటి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు వ్యవసాయ ఉత్పత్తుల వ్యయం పై 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయిస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ధరలను తగ్గించి నిర్ణయించడం వల్ల రైతులకు గిట్టుబాటు ధర రావడంలేదని వెంటనే పార్లమెంట్లో కనీస మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి కడెం కుమార్, సిఐటియు మండల కన్వీనర్ గూడపూరి వెంకటేశ్వర్లు తంగెళ్ల వెంకన్న భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు అనంతుల మల్లయ్య భవన నిర్మాణ కార్మిక సంఘం నాగారం మండల అధ్యక్షులు మల్లెపాక సోమయ్య పాల్గొన్నారు

Sthanikam

ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న జరిగే "జైల్ భరో''ను జయప్రదం చేయండి.సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News