Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:01 PM

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

07-08-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిగ్రీ, పీజీతో పాటు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులకు సెప్టెంబర్ 9 వరకు అవకాశం

హైదరాబాద్, ఆగస్టు 7:

డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (BRAOU) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 9, 2026 వరకు పొడిగించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయ అధికారులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

విశ్వవిద్యాలయంలో బీ.ఏ, బీ.కాం, బీ.ఎస్సీ డిగ్రీ కోర్సులతో పాటు ఎం.ఏ, ఎం.కాం, ఎం.ఎస్సీ, ఎం.బీ.ఏ, బి.లైబ్‌.ఐఎస్‌సీ, ఎం.లైబ్‌.ఐఎస్‌సీ, వివిధ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరదలచిన అభ్యర్థులు సెప్టెంబర్ 9లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి ట్యూషన్ ఫీజు చెల్లించాలని సూచించారు.

అలాగే 2024–25, 2025–26 విద్యా సంవత్సరాల్లో డిగ్రీలో చేరి ప్రస్తుతం ద్వితీయ, తృతీయ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు, అలాగే గతంలో డిగ్రీ లేదా పీజీ కోర్సుల్లో చేరి ఇప్పటివరకు ఫీజులు చెల్లించని వారు కూడా సెప్టెంబర్ 9లోపు ట్యూషన్ ఫీజును ఆన్‌లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డులు లేదా ఆన్‌లైన్ సేవా కేంద్రాల ద్వారా చెల్లించవచ్చని అధికారులు తెలిపారు.

ప్రవేశాలు, రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. అలాగే విశ్వవిద్యాలయ హెల్ప్‌డెస్క్ నంబర్లు 040-23680222, 040-23680333, 040-23680444, 040-23680555, టోల్‌ఫ్రీ 1800-599-0101 ద్వారా లేదా అధికారిక వెబ్‌సైట్లలో పూర్తి సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.

Sthanikam

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News