Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి కంటే పట్టుదల ముఖ్యం.. వెస్టీజ్ మార్కెటింగ్‌లో అభివృద్ధికి అవకాశం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 08:13 PM

జైల్‌ భరోను జయప్రదం చేయాలి.

జైల్‌ భరోను జయప్రదం చేయాలి.

జైల్‌ భరోను జయప్రదం చేయాలి.
08-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: క్విట్‌ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈ నెల 10న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జైల్‌ భరో కార్యక్రమాన్ని కార్మికులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆల్‌ హమాలీ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాసరి పాండు పిలుపునిచ్చారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాస్తారోకోకు మద్దతుగా భువనగిరి పట్టణ పరిధిలోని రైస్‌ మిల్లులు, పరిశ్రమల వద్ద హమాలీ కార్మికులకు కరపత్రాలు పంపిణీ చేసి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో కార్మికులు, ప్రజలు తమ హక్కుల కోసం మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక చట్టాలు, ప్రజాస్వామ్య హక్కులను నిర్వీర్యం చేసే విధానాలను కేంద్ర ప్రభుత్వం విడనాడాలని డిమాండ్‌ చేశారు. ప్రజా, కార్మిక హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న జైల్‌ భరో కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో హమాలీ యూనియన్‌ నాయకులు నరసింహ, ఐలయ్య, ఆసిఫ్‌, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జైల్‌ భరోను జయప్రదం చేయాలి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News