Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

పాఠశాలల వికాసానికి పరిశ్రమల సహకారం అభినందనీయం

08-08-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

దేవలమ్మనాగారంలో ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్

గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నోషి పరిశ్రమ అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని దేవలమ్మనాగారం సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పరిశ్రమ యాజమాన్యం ఆర్థిక సహకారంతో మండల పరిధిలోని దేవలమ్మనాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించనున్న ప్రహరీ గోడ, విద్యార్థుల మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి, బడి సంక్షేమానికి నోషి పరిశ్రమ నిరంతరం తోడ్పాటునందించడం సంతోషదాయకమని కొనియాడారు. విద్యార్థులు ఈ వసతులను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ​కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుర్కంటి అనూప్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మ మైసయ్య, వార్డు సభ్యులు ఊదరి రమేష్, బొమ్మ శ్వేత, బొమ్మ అమరావతి, ఫాతిమా, దోనూరి కిరణ్ రెడ్డి, గట్టు ప్రశాంత్, పాక రాము, సుంకరి శ్రీను, దేశట్ల చైతన్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాలల వికాసానికి పరిశ్రమల సహకారం అభినందనీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News