Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

ప్రాచీన క్రీడ.. ఒలింపిక్సే లక్ష్యం! ట్రినిటీ విద్యాసంస్థల్లో మల్కంబ్‌ శిక్షణ శిబిరం

08-08-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రాచీన భారతీయ క్రీడ అయిన మల్కంబ్‌ను రాష్ట్రవ్యాప్తంగా వ్యాపింపజేయడమే లక్ష్యంగా తెలంగాణ మల్కంబ్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. స్థానిక ట్రినిటీ విద్యాసంస్థల ఆవరణలో శిక్షకులకు 'లెవెల్-1' ప్రాథమిక నియమ నిబంధనలపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ప్రారంభించి మాట్లాడారు. కేవలం పోలీస్ ట్రైనింగ్‌లోనే ఇలాంటి కఠినమైన శిక్షణ ఉంటుందనుకున్నామని, కానీ ఇక్కడ శిక్షకుల ప్రదర్శన చూశాక ఆశ్చర్యం కలిగిందన్నారు. అసోసియేషన్ ఆకాంక్ష నెరవేరి, ఇక్కడ శిక్షణ పొందిన మాస్టర్ ట్రెయినర్లు తీర్చిదిద్దే విద్యార్థులు భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శిక్షకులు చేసిన సాహస విన్యాసాలు అలరించాయి.​కార్యక్రమంలో ఎమ్‌ఎమ్‌ఆర్‌ కాలేజ్ ప్రిన్సిపాల్ సంజయ్ సాహు, ట్రినిటీ చైర్మన్ కేవీబీ కృష్ణారావు, తెలంగాణ మల్కంబ్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉజ్జని మంజుల, జనరల్ సెక్రటరీ ముదావత్ గోపాల్, ట్రెజరర్ పోలే అంజయ్య, వివిధ జిల్లాల నుంచి వచ్చిన 42 మంది శిక్షకులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రాచీన క్రీడ.. ఒలింపిక్సే లక్ష్యం! ట్రినిటీ విద్యాసంస్థల్లో మల్కంబ్‌ శిక్షణ శిబిరం

Article Image

ప్రాచీన భారతీయ క్రీడ అయిన మల్కంబ్‌ను రాష్ట్రవ్యాప్తంగా వ్యాపింపజేయడమే లక్ష్యంగా తెలంగాణ మల్కంబ్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ శిబిరం ప్రారంభమైంది. స్థానిక ట్రినిటీ విద్యాసంస్థల ఆవరణలో శిక్షకులకు 'లెవెల్-1' ప్రాథమిక నియమ నిబంధనలపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ప్రారంభించి మాట్లాడారు. కేవలం పోలీస్ ట్రైనింగ్‌లోనే ఇలాంటి కఠినమైన శిక్షణ ఉంటుందనుకున్నామని, కానీ ఇక్కడ శిక్షకుల ప్రదర్శన చూశాక ఆశ్చర్యం కలిగిందన్నారు. అసోసియేషన్ ఆకాంక్ష నెరవేరి, ఇక్కడ శిక్షణ పొందిన మాస్టర్ ట్రెయినర్లు తీర్చిదిద్దే విద్యార్థులు భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శిక్షకులు చేసిన సాహస విన్యాసాలు అలరించాయి.​కార్యక్రమంలో ఎమ్‌ఎమ్‌ఆర్‌ కాలేజ్ ప్రిన్సిపాల్ సంజయ్ సాహు, ట్రినిటీ చైర్మన్ కేవీబీ కృష్ణారావు, తెలంగాణ మల్కంబ్‌ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉజ్జని మంజుల, జనరల్ సెక్రటరీ ముదావత్ గోపాల్, ట్రెజరర్ పోలే అంజయ్య, వివిధ జిల్లాల నుంచి వచ్చిన 42 మంది శిక్షకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News