Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:25 AM

గుంతల రోడ్డుపై వరి నాట్లవేస్తూ బీఆర్ఎస్ వినూత్న నిరసన

08-08-2026 38 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి నుంచి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు శనివారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.గుంతలతో చెరువులను తలపిస్తున్న రోడ్డుపై వరి నాట్లు వేసి, గాలాలతో చేపలు పడుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు తడకమళ్ల రవికుమార్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆధ్వర్యంలో జాజిరెడ్డిగూడెం నుంచి మానాపురం ఎక్స్‌రోడ్డు వరకు రూ.28 కోట్లతో నూతన రహదారి నిర్మాణానికి 2023 నవంబర్‌లో అప్పటి మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.ప్రస్తుతం ఎమ్మెల్యే మందుల సామేలు కూడా జాజిరెడ్డిగూడెం నుంచి మానాపురం తండా వరకు రోడ్డు నిర్మాణానికి మరోసారి శంకుస్థాపన చేసి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా పనులు పూర్తికాలేదని ఆరోపించారు.రహదారి మొత్తం గుంతలమయంగా మారడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.రోడ్డు పరిస్థితిపై స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు స్పందించి రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, బొంకూరి మధు, కొండగడుపుల వెంకటేష్, కాసర్ల రాజశేఖర్, తడకమళ్ల మధు, బొంకూరి సాయి, కొండ మధు, కడియం గోపి, కొండగడుపుల నాగరాజు, గడ్డం నితిన్, పవన్, బద్రి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుంతల రోడ్డుపై వరి నాట్లవేస్తూ బీఆర్ఎస్ వినూత్న నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News