Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:01 PM

గీతన్నల గళం.. బస్సు యాత్ర బలం! రేపు రామన్నపేటకు చైతన్య బస్సు యాత్ర.. భారీగా తరలిరావాలని పిలుపు.

08-08-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

గీత కార్మికుల సమస్యలు, హక్కుల సాధన కోసం చేపట్టిన గీతన్నల చైతన్య బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 9న రామన్నపేట మండల కేంద్రానికి చేరుకోనున్న బస్సు యాత్రను విజయవంతం చేయాలని గీత కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

బస్సు యాత్ర సందర్భంగా బోగారం గ్రామంలోని కల్లు గీత కార్మికులతో కలిసి నాయకులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వంతో పాటు వివిధ మండలాల నాయకులు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు.

రామన్నపేట మండలం నుంచి మండల నాయకులు, సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు, గీత కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. గీతన్నల ఐక్యతను చాటేలా యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి బావండ్లపల్లి బాలరాజు, మండల అధ్యక్షులు కూనూరు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు మునికుంట్ల లెనిన్, అంతటి దశరథ, చెరుకు సత్తయ్య, జయమ్మ, చెరుకు నర్సింహా, కూనూరు శంకరయ్య, కూనూరు బక్కులు, కూనూరు రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గీతన్నల గళం.. బస్సు యాత్ర బలం! రేపు రామన్నపేటకు చైతన్య బస్సు యాత్ర.. భారీగా తరలిరావాలని పిలుపు.

Article Image

రామన్నపేట

గీత కార్మికుల సమస్యలు, హక్కుల సాధన కోసం చేపట్టిన గీతన్నల చైతన్య బస్సు యాత్రకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 9న రామన్నపేట మండల కేంద్రానికి చేరుకోనున్న బస్సు యాత్రను విజయవంతం చేయాలని గీత కార్మిక సంఘం నాయకులు పిలుపునిచ్చారు.

బస్సు యాత్ర సందర్భంగా బోగారం గ్రామంలోని కల్లు గీత కార్మికులతో కలిసి నాయకులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వారి హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వంతో పాటు వివిధ మండలాల నాయకులు బస్సు యాత్రలో పాల్గొంటారని తెలిపారు.

రామన్నపేట మండలం నుంచి మండల నాయకులు, సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు, గీత కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. గీతన్నల ఐక్యతను చాటేలా యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి బావండ్లపల్లి బాలరాజు, మండల అధ్యక్షులు కూనూరు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు మునికుంట్ల లెనిన్, అంతటి దశరథ, చెరుకు సత్తయ్య, జయమ్మ, చెరుకు నర్సింహా, కూనూరు శంకరయ్య, కూనూరు బక్కులు, కూనూరు రాములు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News