Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేలపట్ల చేనేత సొసైటీ ఛైర్మన్ ఎన్నికపై ‘స్టే’ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 09:14 PM

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుట్‌పాత్‌లపై మటన్, చేపల విక్రయాలు నిషేధం..

08-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..మున్సిపల్ కమిషనర్ బి. వంశీకృష్ణ

నల్లగొండ : నల్లగొండ పట్టణంలోని ప్రధాన రోడ్లు, ప్రజా ప్రదేశాలు మరియు ఫుట్‌పాత్‌లపై విచ్చలవిడిగా చేపలు, మటన్ విక్రయాలు జరిపితే తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019 ప్రకారం కఠిన చర్యలు తప్పవని నగరపాలిక మున్సిపల్ కమిషనర్ బి. వంశీకృష్ణ హెచ్చరించారు. ప్రజారోగ్యం, పారిశుధ్యాన్ని పరిరక్షించేందుకు మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రోడ్లపై మాంసం అమ్మకాలు చేపట్టడానికి ఎటువంటి అనుమతులు లేవని, మున్సిపాలిటీ నుంచి తగిన లైసెన్స్ పొందిన దుకాణాలలో మాత్రమే విక్రయాలు నిర్వహించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆదివారాల్లో ఫుట్‌పాత్‌లపై తాత్కాలికంగా ఏర్పాటు చేసే మటన్, చేపల దుకాణాలపై ప్రత్యేక నిఘా మరియు నజర్ ఉంచుతున్నట్లు తెలిపారు.

మాంసం వ్యర్థాలు రోడ్లపై వేస్తే కఠిన చర్యలు..

విక్రయాల అనంతరం మిగిలిన వ్యర్థాలను రోడ్లు, డ్రైన్లలో పడేయడం వల్ల పారిశుధ్యం తీవ్రంగా దెబ్బతింటోందని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై జరిమానాలతో పాటు కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించి వ్యాపారం చేసే వారి స్థావరాలను, ఆక్రమణలను తక్షణమే తొలగిస్తామన్నారు. అవసరమైతే సంబంధిత దుకాణాలను సీజ్ చేయడంతో పాటు, వారి విక్రయ సామగ్రిని స్వాధీనం చేసుకుంటామని మరియు వారి లైసెన్సులను కూడా రద్దు చేస్తామని పేర్కొన్నారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వ్యాపారులు, ప్రజలు మున్సిపల్ అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Sthanikam

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఫుట్‌పాత్‌లపై మటన్, చేపల విక్రయాలు నిషేధం..

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News