Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

నేలపట్ల చేనేత సొసైటీ ఛైర్మన్ ఎన్నికపై ‘స్టే’

08-08-2026 398 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ముగ్గురు పిల్లల నిబంధన ఉల్లంఘన.. తెలంగాణ కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు

నేలపట్ల చేనేత సహకార సంఘం నూతన ఛైర్మన్ ఎన్నిక వివాదంలో తెలంగాణ కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది. ముగ్గురు పిల్లలున్న విషయాన్ని దాచి నిబంధనలకు విరుద్ధంగా పోటీ చేసిన ఛైర్మన్ పిల్లలమర్రి శ్రీనివాసులు ఎన్నికపై ‘స్టే’ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ​జులై 10న జరిగిన సొసైటీ ఎన్నికల్లో స్థానిక పద్మశాలి కుల సంఘం ప్యానెల్ 6 స్థానాలు, శ్రీనివాస్ ప్యానెల్ 3 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, కుల సంఘం ప్యానెల్ నుంచి ఇద్దరు డైరెక్టర్లను తనవైపు తిప్పుకుని శ్రీనివాస్ అక్రమంగా ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.ఉమ్మడి రాష్ట్ర కో-ఆపరేటివ్ చట్టం ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు పోటీకి అనర్హులు.ఈ నిబంధన ఆధారంగా కుల సంఘం డైరెక్టర్లు—తడక పారిజాత, పిల్లలమర్రి కిరణ్, గంజి శ్రీనివాసు, తడక కోటేశ్వర్—ఆగస్టు 5న కో-ఆపరేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన ట్రిబ్యునల్, శ్రీనివాస్‌కు ముగ్గురు సంతానం ఉన్నట్లు నిర్ధారించి ఛైర్మన్, డైరెక్టర్ ఎన్నికలపై ఆగస్టు 5 నుంచే అమలులోకి వచ్చేలా స్టే విధించింది. ఈ ఉత్తర్వుల కాపీని ప్రతినిధులు యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత ఏడీ కి అందజేశారు.

Sthanikam

నేలపట్ల చేనేత సొసైటీ ఛైర్మన్ ఎన్నికపై ‘స్టే’

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News