Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

పెళ్లి చేసుకోమన్నందుకు మహిళ దారుణ హత్య

పెళ్లి చేసుకోమన్నందుకు మహిళ దారుణ హత్య

పెళ్లి చేసుకోమన్నందుకు మహిళ దారుణ హత్య
16-08-2026 206 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కర్రతో కొట్టి చంపిన నిందితుడు సయ్యద్ బషీర్

కేసును ఛేదించి నిందితుడిని రిమాండ్‌కు తరలించిన చౌటుప్పల్ పోలీసులు

పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు ఒక మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పెద్దకొండూరు గ్రామానికి చెందిన రాయి కొట్టే కూలీ ఎం.డి. సలీమా (38) జులై 25న ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లి సైదాబీ ఆగస్టు 1న చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం క్యాతమ్ పల్లికి చెందిన సయ్యద్ బషీర్ (37)ను శనివారం అదుపులోకి తీసుకుని విచారించారు. జులై 25న భువనగిరి బస్టాండ్‌లో సలీమాను తన పల్సర్ బైక్‌పై ఎక్కించుకుని వెంకటాపురం శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లినట్లు నిందితుడు అంగీకరించాడు. అక్కడ శారీరకంగా కలిసిన అనంతరం సలీమా పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో ఆమెను వదిలించుకోవాలని పక్కనే ఉన్న కర్రతో తలపై బలంగా కొట్టడంతో సలీమా అక్కడికక్కడే మృతి చెందింది. నిందితుడిని అరెస్టు చేసి జుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Sthanikam

పెళ్లి చేసుకోమన్నందుకు మహిళ దారుణ హత్య

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News