Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:04 PM

టీఎన్జీవో భవన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

16-08-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: నల్గొండ జిల్లా టీఎన్జీవో భవన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోస్ యూనియన్ నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగిళ్ల మురళి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులు, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నాగిళ్ల మురళి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనకు స్వేచ్ఛ లభించిందన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, ప్రజా సంక్షేమం, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషించాలని సూచించారు.

ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం టీఎన్జీవోస్ యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఉద్యోగులు ఐక్యంగా ఉంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.

కార్యక్రమంలో టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా కార్యదర్శి జే. శేఖర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షులు డి. రాజు, కోశాధికారి జయరావు, విజయకృష్ణ, ఉపాధ్యక్షులు రణదేవే, దశరథ్, రమ్యసుధ, గోవర్ధన్‌రెడ్డి, ఆంజనేయులు, సిటీ ప్రెసిడెంట్ అకనూరి లక్ష్మయ్య, మనోజ్, ప్రదీప్, భాస్కర్, సత్యనారాయణ, నందు, వెంకటపతి, రవినాయక్, సుమన్, యశ్వంత్, నజీర్, విజయశాంతి, సుమలత, లక్ష్మి, పద్మ తదితర జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ శాఖల ఉద్యోగులు, సంఘ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

టీఎన్జీవో భవన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News