Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:35 AM

సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ

09-05-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ అధికారి శ్రీ యస్. సతీష్ కుమార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ సిబ్బందికి డే డ్రోన్ మరియు నైట్ విజన్ డ్రోన్ ఆపరేటింగ్‌పై ప్రత్యేక హ్యాండ్స్-ఆన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ శిక్షణను జిల్లా హెడ్‌క్వార్టర్స్ నుండి వచ్చిన సాంకేతిక నిపుణులు మరియు పోలీస్ సిబ్బంది అందించారు. కార్యక్రమంలో సోమందేపల్లి ఎస్‌.ఐ జి. సుధాకర్ యాదవ్ గారు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

శిక్షణలో భాగంగా డ్రోన్ల వినియోగంపై ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించడంతో పాటు, భవిష్యత్తులో ఆధునిక పోలీసింగ్‌లో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనున్నదని వివరించారు. లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ, భారీ జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల మానిటరింగ్, ఓపెన్ డ్రింకింగ్, గంజాయి మరియు ఇతర అక్రమ కార్యకలాపాల గుర్తింపు, రాత్రివేళల్లో నైట్ విజన్ ద్వారా గస్తీ, తప్పిపోయిన వ్యక్తుల అన్వేషణ, రోడ్డు ప్రమాదాలు మరియు అత్యవసర పరిస్థితుల పరిశీలన, సరిహద్దు మరియు నిర్మానుష ప్రాంతాల పర్యవేక్షణ, పాఠశాలలు మరియు ముఖ్య ప్రభుత్వ భవనాల భద్రత వంటి అంశాల్లో డ్రోన్ల వినియోగంపై శిక్షణ ఇచ్చారు.

డ్రోన్ టెక్నాలజీ ద్వారా తక్కువ సమయంలో విస్తృత ప్రాంతాలను పర్యవేక్షించడం సాధ్యమవుతుందని, పోలీసింగ్‌ను మరింత ఆధునికంగా మరియు సమర్థవంతంగా మార్చడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్‌.ఐ జి. సుధాకర్ యాదవ్ గారు మాట్లాడుతూ, “భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానం పోలీసింగ్‌లో కీలక పాత్ర పోషించనుంది. ప్రజల భద్రత కోసం ఆధునిక టెక్నాలజీ వినియోగంలో మా సిబ్బంది ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటారు” అని పేర్కొన్నారు.

Sthanikam

సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News