శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్దమంతూరు ZPH పాఠశాలలో ఈ రోజు విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబర్చారు. మొత్తం 53 మంది విద్యార్థులకు గాను 43 మంది ఉత్తీర్ణులై పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు.
ఈ ఫలితాల్లో శేషాపురం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి కుమార్తె R. పూజిత 573/600 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్‌గా నిలిచింది. ఆమె ప్రతిభకు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పి. రొప్పాల్ టీడీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి