Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:18 AM

సరస్వతీ పుత్రికకు రూ.10 వేల ఆర్థిక సాయం

సరస్వతీ పుత్రికకు రూ.10 వేల ఆర్థిక సాయం

సరస్వతీ పుత్రికకు రూ.10 వేల ఆర్థిక సాయం
14-07-2026 239 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అక్షర ఫౌండేషన్ సేవలు అభినందనీయం : రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

ఆర్థిక ఇబ్బందులు ప్రతిభావంతులైన విద్యార్థుల చదువుకు అడ్డంకిగా మారకూడదని, నిరుపేద విద్యార్థులకు చేయూతనందించడం సమాజ బాధ్యత అని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు.

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్‌లో సోమవారం అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో, యాస శృతి సౌజన్యంతో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నూతనకల్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని సప్పిడి నందినికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చదువులో రాణిస్తూ అన్ని రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న నిరుపేద విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించడం హర్షణీయమన్నారు. విద్యార్థులు ఇలాంటి సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సమాజంలోని దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, క్రీడలు, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విశేష సేవలందిస్తూ అక్షర ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ చైర్మన్ యాస రామ్‌కుమార్ రెడ్డి, అధ్యక్షుడు ఉప్పు నాగయ్య, కార్యదర్శి రుద్రంగి కాళిదాసు, సుభాష్ చంద్రబోస్, బత్తిని ఉపేందర్, కాసర్ల సైదులు, గడ్డం వీరబాబు, ధరావత్ వీరాసింగ్, గంగాధర్, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సరస్వతీ పుత్రికకు రూ.10 వేల ఆర్థిక సాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News