Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:52 PM

ప్రగతి పథంలో తంగడపల్లి జెడ్పీహెచ్‌ఎస్.. నూతనంగా 110 అడ్మిషన్లు

14-07-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

100 శాతం ఫలితాలతో మేటిగా నిలిచిన పాఠశాల

విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపునకు 'హౌస్ సిస్టమ్'

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం పరిధిలోని తంగడపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రగతి పథంలో దూసుకెళ్తోంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలో నూతనంగా 110 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారని, దీంతో పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్య 320కి చేరిందని ప్రధానోపాధ్యాయురాలు డి. భార్గవి తెలిపారు. చౌటుప్పల్ మండలంలోనే ఈ పాఠశాల ఒక ఉన్నతమైన విద్యాసంస్థగా రాణిస్తోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు.​గత పదో తరగతి ఫలితాలలో పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించిందని హెచ్ఎం గుర్తుచేశారు. విద్యార్థులు ఉత్తమ మార్కులతో (562, 560, 542, 530, 515) ఉత్తీర్ణులయ్యారని, ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

​క్రమశిక్షణ కోసం 'హౌస్ సిస్టమ్'..

​పాఠశాల విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు మంగళవారం పాఠశాలలో 'హౌస్ సిస్టమ్' (సదనాల విధానం)ను ప్రారంభించారు. పాఠశాలలోని విద్యార్థులందరినీ నాలుగు హౌసెస్ (సదనాలు)గా విభజించి.. ప్రతి హౌస్‌కు ఒక కెప్టెన్, వైస్ కెప్టెన్‌ను నియమించారు. అలాగే పాఠశాల మొత్తానికి హెడ్ బాయ్, హెడ్ గర్ల్‌ను ఎన్నుకున్నారు.​ఈ సందర్భంగా హెచ్ఎం భార్గవి మాట్లాడుతూ.. ఈ విధానం ద్వారా విద్యార్థులతోనే ప్రతిరోజూ ప్రార్థన నిర్వహణ, మధ్యాహ్న భోజన పర్యవేక్షణ, క్రమశిక్షణ అమలు, పాఠశాల ప్రాంగణంలో పరిశుభ్రత-పచ్చదనం మెరుగుపరచడం వంటి బాధ్యతలను చూసుకునేలా ప్రణాళికలు వేశామన్నారు. దీనివల్ల విద్యార్థులలో బాధ్యతాయుత ప్రవర్తన, స్నేహపూర్వక వాతావరణం ఏర్పడి పాఠశాల మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంతటి వెంకటేశం, సరళ, నీరజ, లింగయ్య, మహేశ్వరి, ప్రతిమ, మంగమ్మ, యాదయ్య, విజయలక్ష్మి, కిరణ్ కుమార్, శ్వేత, యశోద, శ్రీను, శోభ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రగతి పథంలో తంగడపల్లి జెడ్పీహెచ్‌ఎస్.. నూతనంగా 110 అడ్మిషన్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News