Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:08 PM

పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తతే రక్షణ: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి

14-07-2026 98 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పెట్టుబడుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కంగ్టి సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, "మీ డబ్బులు డబుల్ అవుతాయి", "100% సురక్షిత పెట్టుబడి", "కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ" వంటి ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి ఎలాంటి ధృవీకరణ లేకుండా డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనేది తప్పనిసరిగా పరిశీలించాలని, అధిక లాభాలు వస్తాయని చెప్పే పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే అనుమానాస్పద లింకులు, సోషల్ మీడియా పోస్టులు, ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, OTPలు, UPI PIN వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయకూడదని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సీఐ వెంకట్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తతే రక్షణ: కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి

Article Image

పెట్టుబడుల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంగ్టి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కంగ్టి సీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, "మీ డబ్బులు డబుల్ అవుతాయి", "100% సురక్షిత పెట్టుబడి", "కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ" వంటి ఆకర్షణీయమైన ప్రకటనలను నమ్మి ఎలాంటి ధృవీకరణ లేకుండా డబ్బులు పెట్టుబడి పెట్టవద్దని సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంబంధిత సంస్థకు ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేదా అనేది తప్పనిసరిగా పరిశీలించాలని, అధిక లాభాలు వస్తాయని చెప్పే పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అలాగే అనుమానాస్పద లింకులు, సోషల్ మీడియా పోస్టులు, ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని, బ్యాంకు ఖాతా వివరాలు, OTPలు, UPI PIN వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ తెలియజేయకూడదని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సీఐ వెంకట్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News